తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్టోబరు 1 నుంచి ఆన్​లైన్​లో అన్నవరం సత్యదేవుని వ్రతం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అక్టోబరు 1 నుంచి ఆన్​లైన్​లో సత్యదేవుని వ్రత పూజలు చేయనున్నారు. ఆన్​లైన్​లో రుసుము చెల్లించినవారికి యూట్యూబ్ లింక్​ను పంపించనున్నారు.

By

Published : Sep 27, 2020, 1:02 PM IST

అక్టోబరు 1 నుంచి ఆన్​లైన్​లో అన్నవరం సత్యదేవుని వ్రతం
అక్టోబరు 1 నుంచి ఆన్​లైన్​లో అన్నవరం సత్యదేవుని వ్రతం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అక్టోబరు 1 నుంచి ఆన్​లైన్​లో సత్యదేవుని వ్రతం ప్రారంభించడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడియోలో అమ్మవారు, పరమేశ్వరుల విగ్రహం ఏర్పాటు చేశారు. స్టూడియోలో దేవస్థానం పురోహితులు వ్రతపూజలు చేసి... యూట్యూబ్​లో అనుసంధానం చేయనున్నారు. ఆన్​లైన్​ ద్వారా రుసుము చెల్లించే భక్తులకు ఆలయ అధికారులు యూట్యూబ్ లింకు పంపిస్తారు.

భక్తులు ఆన్​లైన్​లో స్వామి వారి వ్రతం వీక్షించే అవకాశంతో పాటు పురోహితుడు చెప్పే వ్రత పూజ ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్రతానికి రూ. 1,116 రుసుము నిర్ణయించామని తెలిపారు. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసి అక్టోబర్ 1 నుంచి ఆన్​లైన్​లో వ్రతాలు ప్రారంభించనున్నామని ఈవో త్రినాథరావు తెలిపారు.

ఇదీ చూడండి:మహిళా "మణులు": ఈ అతివలు అనన్య సామాన్యులు... ఆదర్శ ప్రాయులు!

ABOUT THE AUTHOR

...view details