Voter Application Last Date in Telangana 2023 రాష్ట్రంలో కొత్తగా మరో 4.50 లక్షలు మంది ఓటర్లు.. తనిఖీల్లో దూకుడు పెంచిన పోలీసులు Voter Application Last Date in Telangana 2023 : ఓటర్ల తుదిజాబితా అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో నాలుగున్నర లక్షల ఓట్లు పెరిగాయి. అక్టోబర్ నాలుగో తేదీన ప్రకటించిన జాబితా ప్రక్రారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లకు చేరారు. అక్టోబరు నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటుహక్కు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులు 7,89,000లు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 4,98,000లకు పైగా దరఖాస్తులను పరిష్కరించి.. 4,54,000 మందికి ఓటు హక్కును కల్పించారు.
Telangana Voters List 2023 :నవంబర్ పదో తేదీ లోపు మిగిలిన 91వేల దరఖాస్తులను పరిష్కరించి అర్హులకు ఓటుహక్కు కల్పించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Polls 2023)ల్లో ఓటు వేయాలనుకునే వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. నవంబర్ 10వ తేదీతో ఓటర్ల జాబితాలో చేర్పుల ప్రక్రియ పూర్తి కానుంది. బీఎల్‌వో, ఆన్‌లైన్ విధానంలో లేదా.. voters.eci.gov.in, nvsp.in ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరగనుండగా.. 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లకు, 15వ తేదీ వరకూ ఉపసంహరణకు తుది గడువు ప్రకటించారు. ఆ రోజు వరకు కొత్త ఓటర్ల చేర్పు ప్రక్రియ కొనసాగుతుంది.
Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..
Telangana Election Code 2023 :మరోపక్క ఎన్నికల కోడ్(Telangana Election Code) అమలులో ఉన్నందున పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారీగా నగదు, బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లేని నగదును త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఈసీ.. తనిఖీల సందర్భంగా నగదు తీసుకెళ్తున్న సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొంది.
అటువంటి పరిస్థితుల్లో జిల్లా గ్రీవెన్సెస్ కమిటీల అనుమతితో నగదు వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన వచ్చే వరకు ఓట్ల తొలగింపునకు సంబంధించి పది లక్షలా 60వేలకు పైగా ఫారం7 దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో కేవలం పది వేలు మినహా మిగతా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు. అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత వచ్చిన ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల ప్రక్రియ ముగిశాకే పరిశీలిస్తామన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలపై జీహెచ్‌ఎంసీ, నగరపోలీసు అధికారులకు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలకు శిక్షణ ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో శిక్షణ కార్యక్రమం కొనసాగింది.
Telangana Assembly Election 2023 :స్టాస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు తనిఖీల సందర్భంగా ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రేరేపణలను నిరోధించడంలో క్షేత్రస్థాయిలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయని సీపీ సందీప్ శాండిల్య ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపారు. రాచకొండ వ్యాప్తంగా ఇప్పటికే 12 ఫ్లాగ్ మార్చ్‌లు పూర్తి చేశామని రాచకొండ సీపీ DS చౌహాన్ వెల్లడించారు. రాచకొండ పరిధిలో 3326 పోలింగ్ కేంద్రాలు, 1,035 లైసెన్సుడ్ వెపన్స్ ఉన్నాయనీ.. ఇందులో 861 వెపన్స్ డిపాజిట్ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క రాచకొండ పరిధిలోనే 36 కోట్లు సీజ్ చేశామని వివరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని పరకాలలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
Telangana Election Code Police Checks 2023 : ఎన్నికల తనిఖీల్లో రూ.377 కోట్ల సొత్తు జప్తు.. నాయకుల డబ్బు నయాపైసా చిక్కలేదట!
Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు