తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తే సహించేది లేదు : రోజా

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అప్పల రాజు, ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం గురించి మాట్లాడారు. శ్రీవారి దయతో జలవివాదానికి పరిష్కారం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు. అక్రమ విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తే సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

tirumala venkateswara swamy
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి, ఎమ్మెల్యే

By

Published : Jul 2, 2021, 2:55 PM IST

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అప్పలరాజు దర్శించుకున్నారు. జలవివాదం నెలకొనడం బాధాకరమని.. తిరుమల శ్రీవారి దయతో జలవివాదానికి పరిష్కారం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జలాలు గౌరవప్రదంగా పొందాలన్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియపు మధుసూదన్‌ రెడ్డి ఆయనతో ఉన్నారు.

Minister srinivas Goud : మీ వాటా తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి

జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని... అక్రమ విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తే సహించబోమని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే రోజాతో పాటు.. జబర్దస్త్ బృందం సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శీను కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

మహిళల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపిన రోజా... జల వివాదం పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. సీఎం జగన్‌ తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ వ్యాఖ్యానించారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి, ఎమ్మెల్యే

ఇదీ చదవండి:JALA VIVADAM: జలజగడం.. జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై పహారా

ABOUT THE AUTHOR

...view details