సమాజంలో మహిళల పట్ల వేధింపులను అరికట్టాలని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం వారి రక్షణ విషయంలో పోలీసు శాఖ తరఫున తమ సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్‌లోని దివ్యదిశ సెంటర్లో స్త్రీలపై హింస వ్యతిరేక దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేశారు.
'మహిళలకు అండగా ఎల్లప్పుడూ పోలీస్ శాఖ ఉంటుంది'
సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టడానికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో దివ్యదిశ సెంటర్లో స్త్రీలపై హింసా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'మహిళలకు అండగా ఎల్లప్పుడు పోలీస్ శాఖ ఉంటుంది'
మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. దివ్య దిశ వన్ స్టాప్ సెంటర్ లో వేధింపులకు గురైన వారికి భద్రతనిస్తూ ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అందుబాటులోకి రానున్న హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రో