మహిళలు, మైనర్ల పట్ల జరుగుతున్న వేధింపులను అరికట్టాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మానవ అక్రమ రవాణా అనేది వ్యాపారంగా మారిందని, దానిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని కన్వెన్షన్ సెంటర్లో భూమిక కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మహిళలపై వేధింపులను అరికట్టాలి : మహేశ్ భగవత్ - మహిళల హక్కులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రసంగం
మానవ హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని సూచించారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని కన్వెన్షన్ సెంటర్లో భూమిక కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మహిళలపై వేధింపులను అరికట్టాలి : మహేశ్ భగవత్
మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందని సీపీ పేర్కొన్నారు. ప్రమాదకరమైన కర్మాగారాలలో పనిచేసే 14 ఏళ్ల బాల, బాలికలకు రక్షణ కల్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు. మహిళలకు మానవ హక్కులు, చట్టాలపై అవగాహన అవసరమని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.