CM Jagan visit to Vinukonda: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు విస్తు గొలిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కొద్ది నెలల క్రితం అనధికారికంగా స్టేడియం నిర్మించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. దానికి తన పేరు పెట్టుకున్నారు. ఉన్నత విద్యా మండలి అనుమతి లేకుండానే నిర్మాణం జరిగింది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో నిన్నటి వరకు బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం పేరుతో ఉన్న స్వాగత ద్వారాన్ని రాత్రికి రాత్రే డా. వైఎస్సార్ స్టేడియంగా పేరు మార్చారు.
ఏపీలో రాత్రికి రాత్రే స్టేడియం పేరు మార్పు.. ఎందుకంటే..!
CM Jagan visit to Vinukonda: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన పేరుతో నిర్మించిన స్టేడియం పేరు రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ స్టేడియానికి కొత్తగా.. డాక్టర్ వైఎస్సార్ స్టేడియంగా పేరు మార్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో.. కొద్ది నెలల క్రితం అనధికారికంగా స్టేడియం నిర్మించారు. దీనికి ఎమ్మెల్యే బొల్లా తన పేరు పెట్టుకున్నారు. అయితే.. సీఎం జగన్ వినుకొండ పర్యటన దృష్ట్యా.. నిన్నటి వరకు బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం పేరుతో ఉన్న స్వాగత ద్వారాన్ని మార్చివేశారు.
CM Jagan visit to Vinukonda
అనధికారిక స్టేడియం.. నిర్మించడంపై సీఎం నుంచి మాట రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రాత్రికి రాత్రే వైయస్సార్ స్టేడియంగా పేరు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టును విచారణ జరుగుతోంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఇటీవల ఎమ్మెల్యే అనుచర రియల్టర్లు రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం మీడియాలో రావడంతో వెనక్కు తగ్గారు.
ఇవీ చదవండి: