నగరంలోని ధూల్‌పేట్ నుంచి బోరబండకు తీసుకెళ్తున్న వినాయక విగ్రహం అనుకోని రీతిలో కమాన్ కింద చిక్కుకుపోయింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ వద్ద భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన కమాన్ పైభాగంలో ఈ భారీ వినాయక విగ్రహం కిరీటం తగలడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆ దారిలో ట్రాఫిక్ స్తంభించింది.
Vinayaka stucked: కమాన్ కింద చిక్కుకున్న వినాయకుడు..
హైదరాబాద్‌లో ఓ భారీ వినాయక విగ్రహం ఓ కమాన్ కింద చిక్కుకుపోయింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ వద్ద ఏర్పాటు చేసిన కమాన్ కింద చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వినాయకున్ని తరలించేలా చర్యలు చేపట్టారు.
భారీ వినాయకుడు
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కమాన్ వద్ద ట్రాఫిక్‌ను మరో మార్గంలోకి మళ్లించారు. విగ్రహం తరలిస్తున్న వాహనం టైర్లకు గాలి తీశాకే విగ్రహం ముందుకు కదలింది. అప్పటివరకు ఆ మార్గంలో వెళ్తున్న నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు.