CEO Vikas Raj: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న శశాంక్ గోయల్... డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అదనపు సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త సీఈఓ కోసం... రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన ప్యానల్‌ను సీఈసీకి పంపింది. అందులో వికాస్ రాజ్ పేరును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్‌రాజ్... ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
CEO Vikas Raj: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్‌రాజ్ - CEO Vikas Raj latest updates
CEO Vikas Raj: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
CEO