తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ - KTR

యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్​ చిత్రాల వ్యవహారం దుమారం రేపుతోంది. కాంగ్రెస్​ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. దేవతామూర్తులతో పాటు కేసీఆర్​ బొమ్మను, కారు గుర్తును చెక్కించుకోవడం ఏంటని ప్రశ్నించారు.

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ

By

Published : Sep 6, 2019, 5:47 PM IST

ఎన్నికల ప్రచారంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పదేపదే సారు... కారు... సర్కారు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు అర్థమైందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ విజయశాంతి ఎద్దేవా చేశారు. యాదాద్రిలో చేపడుతున్న ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న స్థూపాల్లో దేవతామూర్తులతో పాటు... కేసీఆర్​ బొమ్మను.. కారు గుర్తును... చెక్కించుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెరాస సర్కార్​ గుర్తును చెక్కడం ద్వారా... కేసీఆర్​ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నట్లు అర్థమవుతోందని ఆరోపించారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్​ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని ప్రజలు పవిత్ర క్షేత్రంగా భావిస్తారని... దానిని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్​ సర్కార్​ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు... పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details