మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమకు అన్యాయం చేశారని విజయలక్ష్మి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ నిర్వాహకురాలు కన్న శివకుమారి ఆరోపించారు. ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు (complaint on etela rajender) చేశారు. ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఇచ్చారు.
హుద్‌హుద్ సమయంలో ఏపీలో కందిపప్పు సరఫరాను బ్యాన్ చేయడం వల్ల.. సేకరణ కాస్త ఆలస్యం అయిందని శివకుమారి తెలిపారు. దాంతో ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. తమను కాదని ఇతరులకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. బ్యాంకు రుణం తీసుకోవడం వల్ల అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు కోటీ 97 లక్షల 57 వేల రూపాయలు చెల్లించి తాము టెండర్లో పాల్గొంటే తమను కాదని వేరే సంస్థకు కందిపప్పు సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్నారు. అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తమను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, అన్యాయానికి గురిచేశారని ఆరోపించారు. ఇకనైనా తమ డబ్బులు ఇప్పించాలని.. తమకు అన్యాయం చేసిన ఈటలపై చర్యలు (COMPLAINT ON ETELA RAJENDER)తీసుకోవాలని సీఎం, డీజీపీకీ ఫిర్యాదు చేస్తామని శివకుమారి తెలిపారు. ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.