తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ ఏడాది పన్నెండున్నర కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం' - పట్టణాల్లో మియావాకి, మున్సిపాలిటీల్లో ట్రీపార్కులు...

హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది పన్నెండున్నర కోట్ల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో ఫరిడవిల్లేలా యాదాద్రి మోడల్​ మియావాకీ చేపట్టాలని, మున్సిపాలిటీల్లో ట్రీపార్కులు ఏర్పాటు చేయాలని అర్వింద్​ కుమార్​ స్పష్టం చేశారు.

video conference on 6th phase of harithaharam in telangana
'ఈ ఏడాది పన్నెండున్నర కోట్ల మొక్కలు నాటటమే లక్ష్యం'

By

Published : Jun 17, 2020, 8:10 PM IST

ఆరో విడత హరిత హారం కింద ముందుగా నిర్ధేశించుకున్న రెండున్నర కోట్ల మొక్కలు కాకుండా ఈ ఏడాది పన్నెండున్నర కోట్ల మొక్కలు నాటాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆర్నెళ్ల కాలంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 500 యాదాద్రి మోడల్​ ప్లాంటేషన్​ పార్కులు, 700 ట్రీ పార్కులు ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

పట్టణాల్లో మియావాకి, మున్సిపాలిటీల్లో ట్రీపార్కులు...

పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో పరిఢవిల్లేలా యాదాద్రి మోడల్​ మియావాకి చేపట్టాలని, మున్సిపాలిటీల్లో ట్రీపార్కులు ఏర్పాటు చేయాలని అర్వింద్​ కుమార్​ స్పష్టం చేశారు. హెచ్​ఎండీఏ పరిధిలో ఐదు కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో రెండున్నర కోట్లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఐదు కోట్ల మొక్కల చొప్పున నాటాలని లక్ష్యం నిర్ధేశించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం చేపట్టాల్సిన పద్ధతులను అర్వింద్​ కుమార్​ వివరించారు.

ఎక్కువ మొక్కలు నాటేలా ప్రణాళికలు

ఇప్పటికే గుర్తించిన ప్రదేశాలతో పాటు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కువ మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల మధ్యలో, ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటి కంటికి ఇంపుగా, పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న క్వారీలు, డంప్​ యార్డుల చుట్టూ కీ రోల్​ పద్ధతిలో గ్రీనరీ పెంపకాన్ని చేపట్టాలని ముఖ్య కార్యదర్శి కోరారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కనీసం 60 యాదాద్రి మోడల్​ ప్లాంటేషన్,​ మరో 60 పార్కులు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి డ్రాఫ్ట్​లేఅవుట్, ఫైనల్ లేఅవుట్ పర్మిషన్లు పొందిన వెంచర్లలో ఇంకా ఏ మేరకు ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటిలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ ప్లానింగ్​ డైరెక్టర్లకు సూచించారు.

ఇదీ చూడండి:'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

ABOUT THE AUTHOR

...view details