కేంద్ర ప్రభుత్వం ప్రకటించినసులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, 3వ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొలి, మూడవ స్థానంలో నిలిచిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు అభినందనలు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2019 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. సులభతర వాణిజ్య విభాగం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకింగ్స్ విడుదల చేశారు.
ఇదీచూడండి.. "పొలంలో ఇల్లు కట్టుకున్నా.. రికార్డు చేయాల్సిందే..!"