కేంద్ర బడ్జెట్‌ను నిర్లిప్తమైన బడ్జెట్‌గా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదని ఆక్షేపించారు. ప్రధాని నరేంద్రమోదీ రెండోమారు అధికారంలోకి వచ్చాక సొంతగా చెప్పుకునే ఒక్క ఫ్లాగ్ షిప్ పథకం కూడా లేకపోవడం బాధకరమన్నారు.
'కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు'
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తదనమేదీ లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆక్షేపించారు. బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు.
పద్దుల కేటాయింపులు కూడా సర్వసాధారణంగా ఉన్నాయే తప్ప కొత్త ఆలోచనలు ఏవీ లేవని వినోద్ వ్యాఖ్యానించారు. యంగ్ నేషన్ అంటూ యువతరానికి ఒక్క పథకాన్ని కూడా ప్రకటించలేదని... నైపుణ్యాభివృద్ధి కోసం నయా పైసా కూడా బడ్జెట్లో పెంచలేదని విమర్శించారు. విద్య, ఆరోగ్యం తమ ప్రాధాన్యతలని చెప్తోన్న కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయలేదని వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన ఆక్షేపించారు.
ఇవీ చూడండి:కాళేశ్వరానికి జాతీయ హోదా కోరినా స్పందించలేదు: నామ