తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి - గవర్నర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్ రావు కలిశారు. అక్టోబర్​లో జరిగనున్న అగ్రికల్చర్ సదస్సుకు గవర్నర్​ను ఆహ్వానించారు.

గవర్నర్​ను కలిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి

By

Published : Sep 17, 2019, 10:28 PM IST

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్​నుఆచార్య జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్‌రావు మర్యాద పూర్వకంగా కలిశారు. వర్సిటీకి ఛాన్సలర్‌ అయిన గవర్నర్‌కు విశ్వవిద్యాలయం స్థాపించిన నాటి నుంచి సాధించిన ప్రగతిని వివరించారు. అంతర్జాతీయ సంస్థలతో వర్సిటీ కుదుర్చుకున్న ఒప్పందాలను తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు కావటంలో వ్యవసాయ వర్సిటీ పాత్ర గురించి ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. అక్టోబర్‌లో జరగనున్న రీజినల్ వర్క్‌షాప్‌ ఆన్ యూత్‌ యాజ్‌ ఏ టార్చ్‌ బేరర్స్‌ ఫర్‌ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్‌ సదస్సుకు గవర్నర్​ను​ ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details