యురేనియం తవ్వకాలు ఆపేందుకు యుద్ధప్రాతిపదికన ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. అవసరమైతే ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లను కలుస్తామని తెలిపారు. ఈనాడు దినపత్రిక యురేనియంపై మంచి వార్త రాసిందని వీహెచ్ కితాబుచ్చారు. యురేనియం తవ్వకాలతో అటవీ జంతువులకు ప్రమాదం పొంచి ఉందని, నీళ్లు కలుషితం అయి మానవాళికి ఎన్నో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
యురేనియం తవ్వకాలతో మానవాళికే ముప్పు: వీహెచ్
"సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపినందుకే జైలు పాలయ్యాడు. యురేనియం తవ్వకాలతో నల్లమలలోని జంతుజాలం అంతా అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.
యురేనియం తవ్వకాలు జరిపి మానవాళి ప్రాణాలు తీస్తారా?