తెలంగాణ

telangana

By

Published : Oct 10, 2021, 2:02 PM IST

ETV Bharat / state

vaccination in telangana: శరవేగంగా వ్యాక్సినేషన్.. త్వరలో వందశాతం తొలిడోస్

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్(vaccination in telangana) ప్రక్రియ వేగంగా సాగుతోంది. మూడు నెలల్లో వంద శాతం మందికి కనీసం ఒకడోస్ పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. తొలిడోస్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తూ... గ్రామీణ ప్రాంతాల్లోనూ టీకా పంపిణీని శరవేగంగా సాగిస్తోంది. ఫలితంగా గడచిన 20రోజుల్లో దాదాపు 40లక్షల డోసులు పంపిణీ చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా 1.71 కోట్ల మందికి మొదటి డోస్ టీకాల పంపిణీ పూర్తి చేసింది.

vaccination in telangana, covid vaccination 2021
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్, కొవిడ్ వ్యాక్సినేషన్ 2021

కొవిడ్ మహమ్మారి కట్టడిలో టీకా కీలక పాత్ర పోషిస్తుందని డబ్ల్యూహెచ్‌వో సహా వైద్యులు, శాస్త్రవేత్తలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రజలంతా తప్పకుండా వ్యాక్సిన్(vaccination in telangana) తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశజనాభాకు సరిపడా టీకాల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతోంది. ఫలితంగా గతనెలలో రాష్ట్రాలకు టీకా సరఫరా కాస్త మెరుగుపడింది. తెలంగాణ సైతం ఏకంగా 20 రోజుల వ్యవధిలో 40లక్షల టీకాల పంపిణీని పూర్తి చేసింది.

స్పెషల్ ఫోకస్

వ్యాక్సినేషన్, కరోనా(corona news) నియంత్రణపై హైకోర్టుకు(TS High court) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(DH) నివేదికను గతనెల 22న సమర్పించారు. రానున్న మూడు నెలల్లో వంద శాతం మందికి కనీసం ఒకడోస్ పంపిణీ చేయాలనే కోర్టు ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 39,39,693 డోసుల టీకాలను అందించింది. అంటే రోజుకి సుమారు 2.18 లక్షల డోసుల టీకాలను పంపిణీ చేస్తోంది వైద్యారోగ్య శాఖ. మరోవైపు సెప్టెంబర్‌లో అత్యధికంగా అనగా రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల డోసుల పంపిణీ చేపట్టడం గమనార్హం.

వ్యాక్సినేషన్ వివరాలు ఇలా..

కోర్టు గత నెలలో ఆదేశించిన నాటికి 2,36,16,996 డోసుల టీకాలను(vaccination in telangana) పంపిణీ చేయగా... నేటికది 2,75,56,689కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం మందికి తొలిడోస్ పూర్తయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ(vaccination in ghmc) పరిధిలో దాదాపు వంద శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా... రంగారెడ్డి పరిధిలోనూ 95 శాతానికి మించి మొదటిడోస్ అందించినట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.2 కోట్ల మంది కొవిడ్ టీకాలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. అంటే మరో 48 లక్షల మందికి మొదటి డోస్ టీకాలు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,71,74,566 మందికి వ్యాక్సిన్ అందించగా... కేవలం 64,42,430 మందికి మాత్రమే రెండు డోసులు పూర్తి అయ్యాయి.

మూడో ముప్పు లేకుండా..

కొవిడ్ కేసులు(covid cases news) తగ్గుముఖం పడుతుండటంతోపాటు... ప్రజలు సాధారణ జీవన విధానానికి అలవాటు పడుతున్న తరుణంలో మూడోవేవ్(covid third wave news) ముప్పు లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలరోజుల్లోనే కనీసం ఒకడోస్ టీకా పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు తగిన టీకా డోసులు అందించాలని ఇప్పటికే కేంద్రానికి నివేదించినట్టు సమాచారం.

ఇదీ చదవండి:CM KCR about wall collapse incident: కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం

ABOUT THE AUTHOR

...view details