కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అప్పటి వరకు షరతులు కొనసాగుతాయని వివరించారు. అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. ఇ- పాస్ కోసం పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు' - AP Latest News
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై డయల్ 100, 112కు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోనే ఉంటుందన్నారు డీజీపీ సవాంగ్. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని.. శుభకార్యాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్న డీజీపీ.. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు 104, 108 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై డయల్ 100, 112కు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండీ:ఆ ఊళ్లో విగ్రహాలు కూడా మాస్కులు పెట్టుకున్నాయి...