తెలంగాణ

telangana

ETV Bharat / state

Vehicles Increasing In Hyderabad : భాగ్యనగరంలో భారీగా కొత్త వాహనాల కొనుగోళ్లు.. ఎక్కువగా అవేనట..! - Number of cars in Hyderabad

Vehicles Increasing In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కొత్త వాహనాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఖరీదైన వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు రవాణా శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కొనుగోళ్లతో రవాణా శాఖకు పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. నగరంతో పోలిస్తే.. శివార్లలో వాహన కొనుగోళ్లు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

Vehicles
Vehicles

By

Published : May 22, 2023, 1:43 PM IST

Vehicles Increasing In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్​ వ్యాప్తంగా కొత్త వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ద్విచక్ర వాహనాలతో పాటు ఖరీదైన కార్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జీవిత కాల పన్నుల ద్వారా రవాణా శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2022-23 సంవత్సరంలో హైదరాబాద్‌తో పోలిస్తే.. రంగారెడ్డిలో వాహన కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు రవాణా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం రూ.1,523.66 కోట్ల రెవెన్యూ రాగా.. అందులో రూ.1,243.06 కోట్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్​లో గడిచిన ఏడాదిలో రూ.1,323 కోట్ల ఆదాయం రాగా.. రూ.1,078 కోట్లు జీవిత కాలం పన్ను రూపంలో సమకూరింది. ముఖ్యంగా రూ.10 లక్షలు.. ఆపైన ఖరీదైన కార్లు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మొదటి వాహనానికి 17 శాతం, రెండో వాహనానికి 18 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

వాహనాల కొనుగోలు ద్వారా రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. నగరం విస్తరించడంతో పాటు చాలా మంది శివార్లలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ల వైపు నివాస సముదాయాలు పెరుగుతున్నాయి. దీంతో నగర శివారు చిరునామాతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో నగరం కంటే శివార్లలోనే రవాణా శాఖ ఆదాయం రెట్టింపు అవుతోంది. కొత్త వాహనాల కొనుగోలులో అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. రంగారెడ్డిలో ఈసారి ఏకంగా 75 శాతం వృద్ది నమోదైనట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఇలా..:

పన్నుల వివరాలు 2022-23 2021-22 వృద్ధి శాతం
క్వార్టర్లీ ట్యాక్స్ 127.36 73.8 72.8
లైఫ్ ట్యాక్స్ 1,243.05 706.48 75.9
ఫీజులు 107.85 65.56 64.56
జరిమానాలు 25.4 8.02 216.7
సేవా రుసుం 20.0 16.43

21.7

మేడ్చల్​ మల్కాజ్​ గిరి జిల్లాలో..:

పన్నుల వివరాలు 2022-23 2021-22 వృద్ధి శాతం
క్వార్టర్లీ ట్యాక్స్ 111.36 67.68 64.5
లైఫ్ ట్యాక్స్ 939.13 568.08 65.3
ఫీజులు 64.5 95.37 60.44
జరిమానాలు 22.4 5.82 264.9
సేవా రుసుం 19.75 16.45 20.1

పెరిగిపోతున్న కాలుష్యం..: మరోవైపు వాహనాలు పెరిగిపోవడంతో సమస్యలూ పెరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్య నీడలో సతమతమవుతున్న భాగ్యనగరంలో.. వాహనాలు పెరగడంతో కార్బన్​ ఉద్ఘారాలు పెరుగుతున్నాయి. అంతేకాక పలు జంక్షన్​ల వద్ద ట్రాఫిక్​ను నియంత్రించడం కష్టతరమవుతోంది. ఇప్పుడు రవాణా శాఖ గణాంకాలతో పర్యావరణవేత్తలతో పాటు పోలీసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు కాలుష్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details