నిరుపేదలకు, వృద్ధులకు సహాయం చేయాలనే లక్ష్యంతో సికింద్రాబాద్లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ వారు ఈరోజు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నిరుపేదలకు బియ్యం, దుప్పట్లు, 200 రూపాయాలు అందజేశారు. మంచి మార్కులు సాధించిన ఇద్దరు పేద విద్యార్థులకు పదివేల రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హజరతయ్యా గుప్తా హాజరయ్యారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ గుప్తా 1960లో 11 మందితో వాసవి క్లబ్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కులమతాలకు అతీతంగా తాము సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుప్తా స్పష్టం చేశారు.
'కులమతాలకతీతంగా సేవ చేయాలి' - 'కులమతాలకతీతంగా సేవ చేయాలి'
కులమతాలకు అతీతంగా అందరూ మంచి ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని అంతర్జాతీయ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హజరతయ్యా గుప్తా తెలిపారు.
'కులమతాలకతీతంగా సేవ చేయాలి'