తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కేసీఆర్‌తోనే సాధ్యం' - తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాజా వార్తలు

ఎస్సీ వర్గీకరణ కోసం నిబద్దతతో ఉన్న ఏకైక పార్టీ తెరాస అని తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

'ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కేసీఆర్‌తోనే సాధ్యం'
'ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కేసీఆర్‌తోనే సాధ్యం'

By

Published : Nov 21, 2020, 6:39 PM IST

ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని... అందుకే గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస పార్టీని గెలిపించాలని ఎస్సీలను తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ కోరారు.

ఎస్సీ వర్గీకరణ కోసం నిబద్ధతతో ఉన్న ఏకైక పార్టీ తెరాస అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఎస్సీల ప్రయోజనాలను నేరవేర్చే పార్టీ తెరాస.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. పట్టణ ప్రాంతంలో ఎస్సీలు మరింత ప్రగతి సాధించాలంటే గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసని గెలిపించాలి. మలిదశ ఉద్యమంతో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అక్షర జ్ఞానం అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. ఇప్పుడు కేసీఆర్‌ అదే దిశగా అడుగులు వేస్తున్నారు.

-వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ, తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:టౌన్‌షిప్‌ పాలసీతో భాగ్యనగరంపై తగ్గనున్న భారం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details