మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని.. ముషీరాబాద్‌లోని అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వేడుకల్లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. రామ్ నగర్, భోలక్‌పూర్, కవాడిగూడ డివిజన్లలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
మహిళల సాధికారత పెంపొందించే దిశగా ప్రధాని మోదీ పిలుపుమేరకు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమని లక్ష్మణ్ పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో మూసివేసిన మహిళా శిక్షణా కేంద్రం.. సంక్రాంతి తర్వాత పునః ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే దిశగా.. పలు అంశాల్లో నిర్మాణాత్మకమైన శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.