రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో మొత్తం 1,86,527మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో 1,79,568 మందికి మొదటి డోసు కాగా... మరో 6,959 మందికి రెండో డోసు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 66,48,674 మందికి తొలి డోసు, 15,17,489 మందికి రెండో డోసు పూర్తైందని పేర్కొంది. మొత్తం 81,66,163 మందికి టీకాలు అందించినట్లు వివరించింది.
vaccination: 24 గంటల్లో రాష్ట్రంలో 1,86,527మందికి టీకాలు - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,86,527మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 81,66,163 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. 15,17,489 మందికి రెండో డోసు పూర్తైందని తెలిపింది.
వ్యాక్సినేషన్, తెలంగాణలో టీకా పంపిణీ
కొవిన్ పోర్టల్ ప్రకారం 74,15,490 టీకా డోసులు కేటాయించగా... ఇప్పటికే 73,40,969 డోసులు వినియోగించినట్లు వెల్లడించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో 8,25,194 డోసుల టీకాలు అందించినట్లు గణాంకాల్లో నమోదు చేశారు.