విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఓయూ దూరవిద్య కేంద్రంలో యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలి: రాంచందర్ రావు - యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలంటూ ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్
రాష్ట్రం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థ నాశనమైందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయలేదని అన్నారు. ఓయూ దూరవిద్య కేంద్రంలో యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలి : రాంచందర్ రావు
విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు తీరాలంటే వైస్ ఛాన్స్‌లర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం వల్ల వారికి సమస్యలపై అవగాహన ఉండదన్నారు. యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులనే వీసీలుగా నియమించాలని రాంచందర్ రావు కోరారు.