అంకుర సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో వీ- హబ్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని క్యూమార్ట్‌లో ఏర్పాటుచేసిన వీ కార్నర్ స్టాల్‌ను ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి ప్రారంభించారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే సంకల్పంతో క్యూమార్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు వీ-కార్నర్ ఎంతగానో దోహదపడుతుందని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.
VHUB MARKETING: వీహబ్ - ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం - ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్
మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన వీ-హబ్ మరో ముందడుగు వేసింది. అంకుర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రముఖ సూపర్ మార్కెట్ క్యూ మార్ట్‌తో వీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. సహజ సిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులతో పాటు బేకరీ తినుబండారాల కోసం క్యూ మార్ట్‌లో వీ-కార్నర్ పేరిట ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేసింది.
వీ-హబ్ మరో ముందడుగు
మూడేళ్లుగా వీ హబ్ ద్వారా మహిళలకు ఐటీఉత్పత్తులతోపాటు ఆహారఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నట్లు వీ-హబ్ సీఈవో దీప్తి తెలిపారు. అంకుర సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేసిన మహిళా పారిశ్రామివేత్తలు వీ హబ్ అందిస్తున్న ప్రోత్సాహం ఎంతగానో మేలు చేస్తుందని వివరించారు. అంకుర సంస్థలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: