లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు రాష్ట్రం నుంచి సొంతూళ్లకు తిరిగి ప్రయాణానికి అయ్యే రైల్వే రవాణా ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన ఉత్తమ్ - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత గూటికి చేరుకునేందుకు వెళ్తున్న వలస కార్మికులకు అయ్యే ఖర్చు తాము భరించనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన ఉత్తమ్
ఇదే అంశంపై చర్చించేందుకు తమకు సమయమిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టాస్క్‌ఫోర్స్ కమిటీ కన్వీనర్ నిరంజన్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌లను ప్రతినిధులుగా పంపించనున్నట్లు ఉత్తమ్ ఆ లేఖలో వివరించారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ