తెలంగాణ

telangana

ETV Bharat / state

'యురేనియం తవ్వకాలకు కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకం' - UTTAM_ON_URENIUM

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఇవాళ హైదరాబాద్​లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. "యురేనియం ఆపాలి- నల్లమల పరిరక్షించాలి" అనే అంశంపై నేతలు చర్చించారు. యురేనియం తవ్వకాలకు కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

'యురేనియం తవ్వకాలకు కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకం'

By

Published : Sep 17, 2019, 12:00 AM IST

తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు కాంగ్రెస్​ పూర్తి వ్యతిరేఖమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జనసేన పార్టీ నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్‌ దస్‌పల్లా హోటల్‌లో "యురేనియం ఆపాలి-నల్లమల పరిరక్షించాలి'' అనే అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తమ సీనియర్‌ నేత వి.హనుమంతురావు అధ్యక్షతన 17 మంది సభ్యులతో పోరాట కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రాంతంలో ఆందోళనలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. యురేనియం తవ్వకాల వల్ల వెలువడే రేడియా ధార్మికత ప్రజా జీవనాన్ని నాశనం చేస్తుందని, దాని ప్రభావం కృష్ణానదీ పరివాహక ప్రాంతంపై పడుతుందని... నీరంతా కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

'యురేనియం తవ్వకాలకు కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details