స్వేచ్ఛగా, పారదర్శకంగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కోరినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్‌లు పార్థసారథిని కలిసి తెరాసపై ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ రంగ ఆస్తులైన.. మెట్రో రైలు పిల్లర్లు, ఆర్టీసీ బస్సులు, లావిట్రిన్స్‌పై ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.