తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 3:35 PM IST

ETV Bharat / state

నిమ్మ చేసే మేలు అమ్మ కూడా… చేయదు.!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!... ఇదంతా ఒకప్పటి సామెత. ప్రస్తుతం నిమ్మ చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత బాగా వాడుకలో ఉంది. ఔనండీ ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని తిప్పికొట్టాలంటే.. మనలో రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం మనం నిమ్మకాయను తప్పనిసరిగా ఉపయోగించాలి.

lemon to man in preventing the spread of corona virus
నిమ్మ చేసే మేలు అమ్మ కూడా… చేయదట

వైరస్‌ని తిప్పికొట్టాలంటే.. మనలో రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం విటమిన్‌-సి క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది మనకు నిత్యం అందుబాటులో ఉండే నిమ్మపండులో పుష్కలంగా ఉంటుంది..

జలుబు రాకుండా..

* నిమ్మలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

* రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో జలుబు, జ్వరం రాకుండా ఉంటాయి.

* పంటి సమస్యలను దూరం చేస్తుంది. దంతాలను మెరిపిస్తుంది.

* రక్తహీనతతో బాధపడేవారు నిమ్మరసాన్ని తగినంతగా తీసుకోవాలి. ఇది ఇనుము శోషణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సెనగలు ఉడికించి తీసుకున్నప్పుడు దానిపై నిమ్మరసం చల్లుకుని తీసుకోవడం మంచిది. ఇనుము పుష్కలంగా ఉండే ఆహారంతోపాటు జతగా నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే ఆ ఇనుము శరీరానికి వంట పడుతుంది.

* ఎండ వేడిమి వల్ల కందిపోయిన చర్మానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.

* చర్మంపై ముడతలు, బ్లాక్‌ హెడ్స్‌ని తగ్గిస్తుంది. నలుపును పోగొడుతుంది.

* ఉదయం పూట కాఫీకి బదులుగా నిమ్మరసం కలిపిన గ్రీన్‌టీ తాగండి. శరీరానికి కావాల్సిన సూక్ష్మపోషకాలు, విటమిన్‌-సి పుష్కలంగా అందుతాయి. ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా రోజంతా చురుగ్గా ఉంటారు. చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది.

* బరువు నియంత్రణలో భాగంగా కొందరు ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. దాంతో కొన్ని అత్యవసరమైన సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. ఆ లోపాన్ని తగ్గించుకోవడానికి ఏదో ఒక రూపంలో నిమ్మరసం తీసుకోవాలి. సూక్ష్మపోషకాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

* చిరుధాన్యాలను ఉడికించేటప్పుడు నిమ్మతొక్కను వేస్తే సువాసనతోపాటు వాటి రుచి కూడా పెరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details