రాష్ట్రంలో రైతులకు కావాల్సిన మేరకు యూరియా సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు. రానున్న 4 రోజుల్లో 28 వేల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చేందుకు ప్రణాళికను రచించామని తెలిపారు. శనివారం రోజున 7200 మెట్రిక్ టన్నులను గమ్యస్థానాలకు చేర్చామని. మరో 19వేల మెట్రిక్ టన్నుల యూరియా రవాణాలో ఉందని పార్థసారధి తెలిపారు. రహదారి మార్గాన రోజుకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కృష్ణపట్నం, గన్నవరం పోర్టుల నుంచి కోరమాండల్, ఐపీఎల్ కంపెనీలు యూరియా సరఫరా చేస్తున్నాయని పార్థసారధి వెల్లడించారు. సరఫరాను పర్యవేక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ పోర్టుల్లో పలువురు అధికారులను నియమించారన్నారు. యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించే విధంగా చూడాలని డీఈఓలను పార్థసారధి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'డిమాండ్ మేర యూరియా సరఫరాకు ప్రణాళికలు'
రాష్ట్రంలో రైతుల డిమాండ్ మేర యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు. వచ్చే నాలుగు రోజులలో 28 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
డిమాండ్ మేర యూరియా సరఫరాకు ప్రణాళికల రూపకల్పన