సామాన్యుల డిపాజిట్లపై అర్బన్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ ఎక్కువని బ్యాంకింగ్ రంగ నిపుణులు నర్సింహ మూర్తి పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకుల పరిధిలోకి వచ్చిన పట్టణ సహకార బ్యాంకులపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. పట్టణ సహకార బ్యాంకులకు పూర్వ వైభవం వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు పట్టణ బ్యాంకులతో ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు.
పట్టణ సహకార బ్యాంకులకు పూర్వ వైభవం!
పట్టణ సహకార బ్యాంకుల పర్యవేక్షణను పూర్తిస్థాయిలో రిజర్వ్‌బ్యాంక్ పరిధిలోకి తీసుకురావటం వల్ల వాటికి పూర్వ వైభవం వస్తుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు నర్సింహ మూర్తి చెప్పారు. పట్టణాల్లోని చిన్న, మధ్యతరహా వ్యాపారులకు పట్టణ సహకార బ్యాంకుల అవసరం ఎంతో ఉందన్నారు. పట్టణ సహకార బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ఆయన చెబుతున్న నర్సింహమూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి
పట్టణ సహకార బ్యాంకులకు పూర్వ వైభవం!
చిన్న మొత్తాల రుణాల కోసం పట్టణ సహకార బ్యాంకులు ఉత్తమమని పేర్కొన్నారు. గతంలో కొన్ని పట్టణ బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణ లేకే దివాలా తీశాయని అన్నారు. వర్తకులకు పెద్దగా లాభాలు లేకపోయినా.. నియంత్రణ మారుతుందని వివరించారు.
ఇదీ చూడండి :ప్రోటోకాల్ మరిచి వేదికపై ఆసీనులైన తెరాస నేత!
Last Updated : Jun 26, 2020, 11:15 AM IST