Shilpa chowdary cheating case: పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. మూడురోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు... వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇవాళ ఆమెను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు... మరో రెండు రోజులు కస్టడీ కోరగా... ఒకరోజు కస్డడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇప్పటికి రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప... అందుకు తగు ఆధారాలు ఇవ్వలేకపోయింది.. కోర్టు ఆదేశాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆమెను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాళ శిల్పా చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఐదురోజుల కస్టడీలోనూ ఆమె నుంచి పోలీసులు వివరాలు రాబట్టలేకపోయారు. రెండోసారి కస్టడీకు తీసుకున్నపుడు రెండో శనివారం, ఆదివారం సెలవులు కావటంతో బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించలేకపోయామంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో ఒక్కరోజు కస్టడీకు అనుమతినిచ్చింది. మంగళవారం ఆమె నుంచి బ్యాంకు లావాదేవీలు, లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించనున్నట్టు సమాచారం.
Shilpa chowdary police custody: 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. మూడ్రోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు... వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెప్పినట్లు సమాచారం.