తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పల్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌.. టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే? - ఉప్పల్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌

Uppal IND vs NZ match Tickets ఈ నెల 18న ఉప్పల్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులను కలిశారు. మ్యాచ్‌ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

IND vs NZ
ఉప్పల్‌లో IND vs NZ మ్యాచ్‌.. ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయం

By

Published : Jan 11, 2023, 6:25 PM IST

Updated : Jan 11, 2023, 7:01 PM IST

Uppal IND vs NZ match Tickets హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులను కలిశాడు. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్లు అజారుద్దీన్‌ తెలిపారు. 18న ఉప్పల్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో అజారుద్దీన్ సమావేశమై.. మ్యాచ్‌ ఏర్పాట్లపై చర్చించారు.

ఈ నెల 18న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 4 ఏళ్ల తరవాత ఉప్పల్ వేదికగా వన్డే మ్యాచ్ నిర్వహిచనున్నారు. ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరుగుతాయి. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల విక్రయాలు. ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతి ఇస్తాం. జనవరి 15 నుండి 18 వరకు ఫిజికల్‌ టికెట్లు జారీ చేస్తాం. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్‌ టికెట్లు ఇస్తాము. ఆఫ్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లు అమ్మడం లేదు. బ్లాక్‌ టికెట్ల అమ్మకాలపై చర్యలు తీసుకుంటాం.-అజారుద్దీన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు

ఇటీవల ఉప్పల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ టికెట్ల జారీ విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న సగటు ప్రేక్షకులు నిరాశ చెందారు. జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్‌ ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా హెచ్‌సీఏ జాగ్రత్త పడుతుందని తెలుస్తోంది.

ఇవీ చూడండి:

Last Updated : Jan 11, 2023, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details