తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహాత్ముని జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు.

kishan reddy

By

Published : Oct 2, 2019, 1:10 PM IST

ప్లాస్టిక్ వినియోగం, స్వచ్ఛ భారత్​, అవినీతి నిర్మూలనపై ప్రజలను చైతన్యం చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. గాంధీకి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణేశ్‌చౌక్‌ వద్ద గాంధీ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడబోమంటూ ఖైరతాబాద్ డివిజన్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు లంగర్​హౌస్​ బాపూఘాట్​ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. సంకల్పయాత్రలో చింతల రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

ABOUT THE AUTHOR

...view details