UNICEF Praises Telangana Government : మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్‌వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని.. దిక్సూచిగా మారిందని అభినందించింది. రాష్ట్రంలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంది. సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని వెల్లడించింది. 'ఫర్ ఎవ్రీ చైల్డ్ ఏ హెల్తీ స్టార్ట్' హ్యాష్‌ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేస్తూ.. యునిసెఫ్ ఈ మేరకు ట్వీట్ చేసింది. దీనిని మంత్రి హరీశ్‌రావు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం' - UNICEF praises midwifery scheme of Telangana
UNICEF Praises Telangana Government : రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్‌వైఫరీ వ్యవస్థను యునిసెఫ్ ప్రశంసించింది. మాతా, శిశు సంరక్షణలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొంది. ఈ మేరకు 'ఫర్ ఎవ్రీ చైల్డ్ ఏ హెల్తీ స్టార్ట్' హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ఫొటోను ట్వీట్ చేసింది.
UNICEF India praises telangana government