హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. అభం శుభం ఎరగని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విడిచి వెళ్లిపోయారు. ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి విషయమై చైల్డ్ వెల్ఫేర్ సభ్యులకు తెలియజేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేయించి నగరంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. పసికందును ఎవరు విడిచి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
పసికందును విడిచి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు - Papam_Pasivadu
ముక్కుపచ్చలారని చిన్నారి అనాథగా మిగిలాడు. కన్నవాళ్లకు బరువయ్యాడో లేక దూరమయ్యాడో తెలియదు గాని నెల ప్రాయం కూడా లేని పాలబుగ్గల పసివాడు ఒంటరివాడయ్యాడు. తల్లి ఒడిలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారి శిశు సంరక్షణ కేంద్రంలో చేరాడు. ఎల్బీనగర్లో నెల ప్రాయం నిండని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.
పసికందును విడిచి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు