ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని నిరుద్యోగ ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ విమర్శించారు. ఇది మోసపూరిత చర్యగా అభివర్ణించారు. గత ఆరు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి: నిరుద్యోగ ఫ్రంట్ - నిరుద్యోగ ఫ్రంట్ వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే నామమాత్రంగా కేవలం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి: నిరుద్యోగ ఫ్రంట్
తెలంగాణలోని యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని.. లేనిపక్షంలో రాజకీయ శక్తులను ఏకం చేసి కేసీఆర్ను గద్దె దించుతామని హెచ్చరించారు.