తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగ విరమణ వయసు పెంచితే ఉద్యమం తప్పదు' - ఆర్ కృష్ణయ్య తాజా వార్తలు

ఉద్యోగ విరమణ వయసు పెంచవద్దని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఎంపిక అయిన గురుకుల ప్రిన్సిపల్, పీఈటీలకు వెంటనే పోస్టింగ్​లు ఇవ్వాలని స్పష్టం చేసింది. హైదరాబాద్​లో నిరాహార దీక్ష చేపట్టింది.

Unemployment JAC protests in Dharna chowk, Indira Park
ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో నిరుద్యోగ జేఏసీ నిరాహార దీక్ష

By

Published : Jan 7, 2021, 7:54 PM IST

ఉద్యోగ విరమణ వయసు పెంచవద్దని ప్రభుత్వాన్ని రాష్ట్ర నిరుద్యోగ ఐరాస ఛైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు. ఎంపిక అయిన గురుకుల ప్రిన్సిపల్, పీఈటీలకు వెంటనే పోస్టింగ్​లు ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఉద్యమిస్తాం..

హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో చేపట్టిన నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ విరమణ వయసు పెంచితే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని వెంకటేష్ హెచ్చరించారు.

తెరాస రెండు సార్లు అధికారంలోకొచ్చింది. ఇప్పటివరకు 61 శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం విస్మరించింది. ఉద్యోగ విరమణ వయసు తగ్గించాలి. లేదంటే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం.

-నీలం వెంకటేష్, నిరుద్యోగ ఐరాస చైర్మన్

ఇదీ చూడండి:ఆర్​టీ పీసీఆర్​ ల్యాబ్​లలో ఖాళీల భర్తీకి పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details