Woman Committed Suicide At Amberpet In Hyderabad : కట్టుకున్న భర్త అకాల మరణం ఆ మహిళకు తీవ్ర మనోవేదన గురిచేసింది. తన భర్తలేని ఈ లోకంలో తాను కూడా ఎందుకని తనువు చాలించింది. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటుచేసుకుంది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు చూసిన వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కోరె మనోజ్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అలాగే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు.
అనంతరం డల్లాస్‌లోని యూఎస్‌ఏఏ కంపెనీలో ఆటోమేషన్ సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం రావడంతో పాటు జీవితంలో మంచి భాగస్వామి కోసం అతను ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన బత్తుల సురేశ్, ఉమ పెద్ద కుమార్తె అయిన సాహితితో వివాహం ఘనంగా జరిపించారు. సాహితి కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసింది. 2021 అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది.
Woman Committed Suicide In Hyderabad : అప్పటి నుంచి మనోజ్, సాహితి డల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. ఏడాదిన్నర పాటు వారి జీవితం హాయిగా సాగిపోయింది. ఒకరినొకరు చాలా అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతోషానికి తోడు ఇటీవలే సాహితికి కూడా డల్లాస్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. తన పాస్‌పోర్ట్ రెన్యువల్‌తో పాటు కుటుంబ సభ్యులను చూసి వెళదామని ఈ నెల 2వ తేదీన సాహితి హైదరాబాద్ వచ్చింది. వనస్థలిపురంలోని అత్తవారి ఇంట్లో, డీడీ కాలనీలోని తల్లి ఇంట్లో సంతోషంగా గడుపుతోంది.
గుండెపోటుతో అమెరికాలో మృతిచెందిన సాహితి భర్త మనోజ్: ఎమైందో ఏమో తెలియదుకానీ.. ఈ నెల 20న డల్లాస్‌లో ఉన్న తన భర్త మనోజ్‌కు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించామని మనోజ్ స్నేహితులు సాహితికి చెప్పారు. చెప్పిన కొద్దిసేపటికే ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమెకు సమాచారం అందింది. దీంతో సాహితి దిగ్బ్రాంతికి గురైంది. జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త ఇక లేడు అన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. స్నేహితుల సాయంతో కుటుంబసభ్యులు మనోజ్ మృతదేహాన్ని ఈ నెల 23న హైదరాబాద్‌కు తెప్పించారు.