సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో దొంగలు తమ చేతివాటాన్ని చూపారు. ఫలహారం బండ్ల ఊరేగింపు సమయంలో భక్తుల రద్దీని లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను అపహరించారు. రవి, సోను అనే వ్యక్తుల నుంచి దాదాపు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అక్కడున్న జనసందోహంలో తమ నగలను అపహరించినట్లు గుర్తించలేకపోయామని బాధితులు వాపోయారు. దీనిపై వారు మోండామార్కెట్ ఠాణా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో దొంగల చేతివాటం - Abduction
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో భక్తులు ఒక వైపు సందడి చేస్తుంటే...మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని చూపారు. ఫలహారం బండ్ల ఊరేగింపు సమయంలో బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన మోండా మార్కెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
chain snatching