తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్​లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ - శంషాబాద్

శంషాబాద్​లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్​ అయ్యాడు. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు ఎయిర్​పోర్ట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్​లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

By

Published : Aug 6, 2019, 5:29 PM IST

శంషాబాద్‌లోని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో కుమార్ అనే రెండేళ్ల బాలుడు కిడ్నాపయ్యాడు. తన కొడుకును గుర్తు తెలియని దుండగులు అపహరించారని తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన వెంకటమ్మ కుటుంబం కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. కుమార్ కిడ్నాప్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్ ఎయిర్​పోర్ట్ సీఐ రామకృష్ణ వెల్లడించారు.

శంషాబాద్​లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

ABOUT THE AUTHOR

...view details