హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి రెండో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా... డెంగీగా నిర్ధారించారు. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న తమ కుమారుడు నర్సు ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్లే కోమాలోకి వెళ్లి చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల కిందట మరణించినా... ఆ విషయం తమకు చెప్పకుండా నాటకం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యానికి రెండో తరగతి విద్యార్థి బలి... - రెండో తరగతి
డెంగీతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌పై వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. కానీ... వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించటం వలన విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. జీవం పోసే దేవుళ్లని మొక్కే ప్రజలతోనే... ప్రాణం తీసే యములని మాటలు పడుతున్నారు.
TWO YEAR OLD BOY DEAD BECAUSE OF DOCTORS RECKLESSNESS