తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల పేరిట మోసం.. ఇద్దరు అరెస్ట్​ - two sudo police arrested in hyderabad

పోలీసులమని నమ్మించి ప్రజలను మోసం చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి హోండా వాహనం, రూ.6300 నగదు, 12 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని మధ్యమండలం ఇంఛార్జీ​ డీసీపీ సుమతి తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరిమీదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

పోలీసుల పేరిట మోసం.. ఇద్దరు అరెస్ట్​

By

Published : Nov 25, 2019, 11:16 PM IST

పోలీసులమంటూ నమ్మించి అమాయక ప్రజలను మోసగించి డబ్బు దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. రూ.6300 నగదు, 12 తులాల వెండి ఆభరణాలు, హోండా యాక్టీవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని మధ్య మండల ఇం​ఛార్జీ​ డీసీపీ సుమతి తెలిపారు.

పోలీసులమని చెప్పి..

కర్నూల్​ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈనెల 21న ఉదయం 3 గంటల సమయంలో ఎంజీబీఎస్​లో దిగారు. అతని వద్దకు రామయ్య అనే వ్యక్తి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని వాకబు చేశారు. పటాన్​ చెరువని వెంకటేశ్వర్లు చెప్పగా.. తాము అటువైపే వెళ్తున్నామంటూ నమ్మించారు. మార్గ మధ్యలో మరో వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. తాను పోలీస్​ అధికారినంటూ నమ్మబలికి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించాడు. విచారణ కోసం పోలీస్​ స్టేషన్​కు రావాలని వారి బైక్​పై ఎక్కాడు. వెంకటేశ్వర్లు నుంచి 12 తులాల వెండి, 1300 నగదును భద్రపరుస్తానని చెప్పి తీసుకున్నారని తెలిపారు.

బషీర్ బాగ్ ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వద్దకు రాగానే ఉన్నతాధికారి నుంచి ఫోన్​ వచ్చిందని చెప్పి వారిద్దరూ అక్కడి నుంచి జారుకున్నారు. మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు అబిడ్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చైతన్యపురికి చెందిన నాగేశ్వరరావు, రామయ్యలను అరెస్ట్​​ చేశారు.

పోలీసుల పేరిట మోసం.. ఇద్దరు అరెస్ట్​

ఇవీచూడండి: నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details