Two People Died in Plant Mixer in Hyderabad : యాజమాన్యం నిర్లక్ష్యం ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం పని కోసం వచ్చిన వారు.. విగత జీవులుగా మారారు. కూలీల మృతులకు కారణమైన యాజమాన్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంస్థపై దాడికి దిగారు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఇద్దరు యువకులు బలయ్యారు. నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన ఆ సంస్థలో చాలా మంది కూలీలు పని చేస్తున్నారు. రెడిమిక్స్ ప్లాంట్ మిక్సర్‌లో ఇద్దరు కార్మికులు శుభ్రం చేస్తున్నారు.
Two Young Man Crushed In Plant Mixer Plant : ఇది గమనించని ఆపరేపర్ మిషన్ ఆన్ చేశారు. మిషన్ ఆన్ చేయడంతో శుభ్రం చేస్తున్న బేటా సోరేన్, సుశీల్ ముర్ము అనే కార్మికులు మిషన్‌లో నుజ్జునుజ్జు అయి మరణించారు. రెడిమిక్స్ ప్లాంట్ యాజమాన్యం మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు అగ్రహావేశాలతో నిర్మాణ సంస్థపై దాడి చేశారు. సంస్థలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి అద్దాలను పగులగొట్టారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.