తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైనర్ లూటీ కేసులో కంజర్‌భట్ ముఠాకు చెందిన మరో ఇద్దరు అరెస్ట్​ - Two accused arrested in cell phone container case

ఏపీలో సంచలనం సృష్టించిన సెల్‌ఫోన్ కంటైనర్ లూటీ కేసులో మధ్యప్రదేశ్ కంజర్‌భట్ ముఠాకు చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంజర్ ‌భట్ ముఠాకు చెందిన నిందితులు మోహిత్ జంజా, రోహిత్ జహల్లాలను నల్లపాడు పోలీసులు పీటీ వారెంట్​పై తీసుకువచ్చి గుంటూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరిగి వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

కంటైనర్ లూటీ కేసులో మధ్యప్రదేశ్ కంజర్‌భట్ ముఠాకు చెందిన
కంటైనర్ లూటీ కేసులో కంజర్‌భట్ ముఠాకు చెందిన మరో ఇద్దరు అరెస్ట్​

By

Published : Oct 18, 2020, 10:54 PM IST

Updated : Oct 19, 2020, 5:23 AM IST

ఏపీలో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా సెల్‌ఫోన్ కంటైనర్ లూటీ కేసులో మధ్యప్రదేశ్ కంజర్‌భట్ ముఠాకు చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు పోలీసుల పరిధిలో ఉన్న కంజర్​‌భట్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులు మోహిత్ జంజా, రోహిత్ జహల్లాలను నల్లపాడు పోలీసులు పీటీ వారెంట్​పై తీసుకువచ్చి గుంటూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరిగి వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

సుమారు రూ.81 లక్షల విలువగల సెల్​ఫోన్లు..

గత నెలలో గుంటూరు శివారు ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై శ్రీ సిటీ నుంచి కోల్‌కతకు వెళ్తున్న సెల్‌ఫోన్‌ కంటైనర్ వెనుక డోరును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం సుమారు రూ. 81 లక్షల విలువైన సెల్‌ఫోన్లను కొల్లగొట్టిన కేసును ఇప్పటికే పోలీసులు ఛేదించారు.

కొనసాగుతోన్న గాలింపులు..

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో ఇద్దరిని తాజాగా పీటీ వారెంట్​పై గుంటూరుకు తీసుకువచ్చారు. కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఏడుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇవీ చూడండి : వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

Last Updated : Oct 19, 2020, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details