తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీని ఢీకొట్టిన బైక్​... ఇద్దరు మైనర్లు మృతి - hyderabad

ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు మైనర్ బాలలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్థరాత్రి ద్విచక్ర వాహనం పై నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Breaking News

By

Published : Jul 5, 2019, 6:04 PM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు మైనర్ అబ్బాయిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్ధ రాత్రి జరిగిన ఈ సంఘటన లో ఒకే దిచక్ర వాహనంపై ముగ్గురు యువకులు నాంపల్లి నుంచి కూకట్ పల్లి వెళ్తున్నారు. ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడంతో... ఓ మైనర్ బాలుడు గోపాల్ సంఘటన స్థలంలో మృతి చెందగా... మిగిలిన ఇద్దర్నీ సైఫాబాద్​ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు షోయబ్ మృతి చెందగా... బిట్టు అనే యువకుడు చికిత్స పొందుతున్నారు. ముగ్గురు యువకులు ఎల్లమ్మ బండకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అతి వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

లారీని ఢీకొని ఇద్దరు మైనర్లు మృతి

ABOUT THE AUTHOR

...view details