ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచిన ఇద్దరు చిన్నారులు - children's distribute theEssential Commodities to poor people
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, అర్ధాకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఇద్దరు చిన్నారులు మందుకొచ్చిన ఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.... సమాజంలో నెలకొన్న పరిస్థితులను ఇద్దరు చిన్నారులు గ్రహించారు. ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్కు చెందిన కృతిక, దీక్షిత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ చిన్నారులు అక్షయ బంధన్ ఫౌండేషన్ ప్రారంభించి విరాళాలను సమకూర్చుకున్నారు. అడిక్మెట్ డివిజన్లోని విద్యానగర్ జామేన ఉస్మానియా వద్ద సేవాదాన్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు వందమంది పేదలు, అర్చకులకు నిత్యావసర సరకులను సికింద్రాబాద్ ట్రాఫిక్ నార్త్ జోన్ ఏసీపీ ఆర్.బి రంగయ్య, చిన్నారులు అందజేశారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీర్చడానికి ఇద్దరు చిన్నారులు చేస్తున్న సేవను ఏసీపీ కొనియాడారు.