తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని పేర్కొంది.

తెలంగాణ వెదర్​ రిపోర్ట్​
తెలంగాణ వెదర్​ రిపోర్ట్​

By

Published : Apr 30, 2021, 12:43 AM IST

రాష్ట్రంలో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు ఉత్తర, తూర్పు, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది.

ఇదీ చూడండి: 'మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు'

ABOUT THE AUTHOR

...view details