హైదరాబాద్ మీర్‌పేట పరిధి సిర్లాహిల్స్ కాలనీకి చెందిన ఓ జంటకు కరోనా పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళతో పాటు ఆమె భర్తకు పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ, వైద్య అధికారులు కాలనీలో పర్యటించి పరిసరాలను రసాయనాలతో శానిటైజేషన్ చేయించారు.
సిర్లాహిల్స్కాలనీలో భార్యాభర్తకు కరోనా పాజిటివ్ - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని సిర్లాహిల్స్ కాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, వైద్య, పోలీసు అధికారులు కాలనీలో పర్యటించి శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.
సిర్లాహీల్స్కాలనీలో భార్యభర్తకు కరోనా పాజిటివ్
కరోనా వచ్చిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న13 కుటుంబాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి... సిర్లాహిల్స్ కాలనీని 15 రోజుల వరకు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాలనీలో ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తూ... నిరంతరం శానిటైజేషన్ చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. సుమారు వంద కుటుంబాలను హోం క్వారంటైన్లో ఉంచామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి:పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ సమరం.. గాంధీభవన్‌లో దీక్ష ప్రారంభం