హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో అవగాహన పరుగు జరిగింది. ఆర్య కన్సల్టెన్సీ సర్వీసెస్, సహారా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్విన్ సిటీ 10కె రన్-2020ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిత్యం పని ఒత్తిడితో పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల వారు మానసికంగా కృంగిపోయి వివిధ రోగాల పడుతున్నారని ఆయన తెలిపారు.
నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా 10కె రన్ - హైదరాబాద్ ఈరోజు వార్తలు
చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కోసం నెక్లెస్‌రోడ్‌లో ట్విన్ సిటీ 10కె రన్-2020పేరుతో పరుగును నిర్వహించారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు సంతోషంగా పాల్గొన్నారు.
చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కోసం 10కె రన్
రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది పిల్లలు వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారని... దీనిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం తల్లిదండ్రులతోపాటు.. పిల్లలు కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. పరుగులో గెలుపొందిన వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి :తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం