తెలంగాణ గ్రామీణ జీవన ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధికి బడ్జెట్లో రూ.23,005 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులపై, ఉద్యోగుల పై కఠిన చర్యలు తీసుకోవడానికి నూతన పంచాయతీరాజ్ చట్టం వీలు కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు, ప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుందని వెల్లడించారు.